calender_icon.png 17 October, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెషల్ బ్రాంచ్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ

17-10-2025 07:57:39 PM

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం నూతన భవనాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రారంభించారు. ఇంతకుముందు పోలీస్ కమిషనర్ నివాసంపైన ఉన్న స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని, పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని అమరవీరుల స్మారక భవనంలోకి తరలించారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం పూజా కార్యక్రమాలు నిర్వహించి, నూతన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, నూతన భవనం ద్వారా స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి మెరుగైన వాతావరణం లభిస్తుందని, వారు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. స్పెషల్ బ్రాంచ్ సేవలు పోలీస్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయని, శాంతిభద్రతల పరిరక్షణకు వారి సహకారం ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు.