calender_icon.png 17 October, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షునిగా చేరాల వంశీ

17-10-2025 07:46:56 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): బీసీ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షునిగా మంచిర్యాల జిల్లాకు చెందిన చేరాల వంశీ ఎన్నికయ్యాడు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి సంఘాల సమావేశంలో వంశీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తానని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చేవరకు ఉద్యమిస్తానని, బడుగు బలహీన విద్యార్థుల అభ్యున్నతి కోసం పాటుపడతానని అన్నారు.