17-10-2025 07:37:28 PM
సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించిన హిందూ సోదరులు
కుభీర్,(విజయాక్రాంతి): ఈ రోజు కుబీర్ గ్రామంలోని శివాజీ కాలనీలో ఉదయము 5 గంటలకు కాలనీవాసులు లేచి చూసేసరికి, లేగదూడ మృత్యువాతకు గురైందని గమనించి, ఇట్టి గోమాత ఎవరికి చెందినదో తెలుసుకోవడానికి పలు వాట్సాప్ గ్రూప్ లలో పంపినప్పటికీ, వ్యక్తిగతంగా కొందరికి అడిగినప్పటికీ, ఎవరు స్పందించకపోవడంతో, ఇట్టి విషయాన్ని గ్రామస్తులు పలువురు అట్టి గోమాత మృతదేహాన్ని గమనించి, పూర్తిగా కడుపు ఉబ్బుకొని ఉండడం, నోటి నుండి నురుగు బయటకు రావడం, శరీరంలో అక్కడక్కడ నీరువంటి పదార్థం బయటకు రావడం గమనించి, వెంటనే గ్రామపంచాయతీ సెక్రటరీ కి తెలియజేయగా సానుకూలంగా స్పందించి జెసిబి ద్వారా అంత్యక్రియలకు సహకరించడం జరిగింది. హిందూ సాంప్రదాయాల ప్రకారం గోమాతకు జెసిబి ద్వారా పూడిక తీసి, పువ్వులు, పసుపు, కుంకుమ, ఎర్రటి వస్త్రము,కొబ్బరికాయ అన్ని సమకూర్చి అంత్యక్రియలు జరపడం జరిగింది.