22 June, 2026 | 2:59 AM

పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

22-06-2026 12:24 AM

మాతా శిశు ఆసుపత్రి, జిల్లా ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

తాండూరు, జూన్ 21 (విజయక్రాంతి) : ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన ఆహారం అందించాలని వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ తో కలిసి మాత శిశు ఆసుపత్రి, జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. అక్కడున్న రోగులతో ఆప్యాయం గా పలకరిస్తూ‘అమ్మా ఆస్పత్రి ఎలా ఉంది? ట్రీట్మెంట్ బాగా అవుతోందా? భోజనం పెడుతున్నారా? సకలానికి వైద్యులు వస్తున్నారా? లేదా? ఏదైనా ఇబ్బంది ఉంటే నా కు చెప్పండని సూచించారు. 

ఆసుపత్రి ఉ ద్యోగుల హాజరు పట్టికను పరిశీలించి, ఏమైనా సమస్యలున్నాయా అని ఉద్యోగుల ను, నర్సులను, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందుల కొరత లేకుం డా చర్యలు తీసుకోవాలని సూపర్డెంట్ వినయ్ కుమార్‌ను ఆదేశించారు. ఆయన వెంట మున్సిప వైస్ ఛైర్మన్ అబ్దుల్ రజాక్, డాక్టర్లు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.