calender_icon.png 27 July, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

24-07-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల అర్బన్, జూలై 23 (విజయక్రాంతి): ఆసుపత్రికి వచ్చే గ్రామీణ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను కలెక్టర్ సత్య ప్రసాద్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపి సేవలు, ఐపీ సేవలు రికారడ్స్, ల్యాబ్ రికారడ్స్, ఐపీ రికారడ్స్, మెడికల్ ఫార్మసి ఫీ వర్ రిజిస్టర్ పరిశీలించి డాక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు.

ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు.రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెనూ ప్రకారం డైట్ అందించాలని, పాలు, ఇడ్లీ, బ్రెడ్, ఫ్రూట్స్ పోషక ఆహార పదార్థాలు అందించాలన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు పై జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు.

డెంగ్యూ, మలేరియా కు అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని, ఆరోగ్య కేంద్రం ఆవరణ, పేషంట్ల గదులు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని చుట్టుపక్కల ఖాళీ ప్లేస్ ఆవరణంలో పిచ్చి మొక్కలు, ముండ్ల చెట్లు తొలగించి వెంటనే పం డ్ల చెట్టును నాటించాలన్నారు.కలెక్టర్ వెంట డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, ఇబ్రహీంపట్నం మండల్ తహసిల్దార్ ప్రసాద్, ఎంపీడీవో సంబంధిత అధికారులుపాల్గొన్నారు.