calender_icon.png 27 July, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యం పేదోడి కంచంలో మెతుకైంది

24-07-2025 12:00:00 AM

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యం

మునుగోడు, జూలై 23 : గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యం దళారుల చేతిలోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం ప్రతి పేదవాడి కంచంలో మెతుకైందని, పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే బిఆర్‌ఎస్ ఓర్వలేక పోతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ని అధికారిక క్యాంపు కార్యాలయంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తో కలిసి మండల వ్యాప్తంగా 1828 నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు.

నాడు వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇచ్చిందని అన్నారు.మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది. పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు రాలేదు, కేవలం ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలు అందించారు.

అనంతరం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ జరగలేదన్నారు. కేవలం ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలు అందించేది గత ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా ఉప ఎన్నికలతో ముడిపెట్టేది, సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా లబ్ధిదారులకు అందేలా చూడాలనే అభిప్రాయంతో శాసనసభ్యులు  రాజగోపాల్ రెడ్డి  ఉన్నారని చెప్పారు.

కులాల కతీతంగా పార్టీలకతీతంగా లబ్ధిదారులకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో శ్రీదేవి, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.