20-11-2025 05:31:03 PM
జిల్లా గవర్నర్గా భద్రాచలం వ్యాపారవేత్త చారుగుళ్ళ శ్రీనివాస్
భద్రాచలం (విజయక్రాంతి): ఖమ్మం పట్టణం వాసవి గార్డెన్స్ లో జరిగిన నూతన సంవత్సరం 2026 కాలానికి ఉమ్మడి ఖమ్మంజిల్లా గవర్నర్ నియామక ప్రక్రియలో భాగంగా భద్రాచలం వాస్తవ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ తాజా మాజీ అధ్యక్షులు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అయిన చారుగుళ్ళ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా ఇటు భద్రాచల పట్టణం, జిల్లా వ్యాప్తంగా ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చారుగుళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ వి 106 ఏ ను సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ప్రథమ స్థానంలో ఉంచడానికి శాయశక్తుల ప్రయత్నిస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం వాసవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు తోకల నాగేశ్వరరావు, అద్దంకి శ్రీనివాసమూర్తి, రీజియన్ చైర్మన్ సీమకుర్తి రాజ మనోహర్, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రేపాక ధనుంజయ రాజ మనోహర్, సముద్రాల అనిల్ కుమార్ పెనుగొండ సంతోష్ ధూప కుంట్ల అనిల్ మరియు ఇతర వాసవి క్లబ్ నాయకులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమానికి ఎన్నికల నిర్వహకులుగా గుమ్మడవెల్లి శ్రీనివాస్, ఎలక్షన్ ఆఫీసర్ గా కడవెండి శ్రీనివాస్, రేగురి హనుమంతరావు, దోసపాటి వెంకటేశ్వరరావు, పోలిశెట్టి శ్రీ శివ కుమార్, కొత్త వెంకటేశ్వరరావు సభ్యులుగా వ్యవహరించడం జరిగింది.