20-11-2025 05:38:06 PM
పాపన్నపేట (విజయక్రాంతి): దేశంలోనే రెండోవన దుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయ హుండీలను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీమతి ఏ సులోచన సమక్షంలో గురువారం గోకుల్ షెడ్ లో లెక్కించారు. శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది లెక్కించారు. గడిచిన 101 రోజుల హుండీని లెక్కించగా రూ. 29,92,712 ఆదాయం సమకూరింది. బంగారం, వెండి ఆభరణాలను తిరిగి హుండీలోనే వేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.