calender_icon.png 14 July, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిండా నిర్లక్ష్యం!

14-07-2025 01:18:27 AM

- ఇంటి గ్రేటెడ్ మార్కెట్ కలేనా? 

- నాడు సంతోషం... నేడు నిర్వేదం

- ఏళ్లుగా నిర్మాణంలో నీలినీడలు

- ఎప్పుడు పూర్తయ్యేనో?

- రోడ్లపైనే విక్రయాలు.. ట్రాఫిక్‌తో ఇక్కట్లు

- అసంపూర్తిగా పనులు

- ఎమ్మెల్యే గారు జర ఇటు చూడరా..!

- పట్టించుకోవాలని ప్రజల విజ్ఞప్తి

మణుగూరు, జూలై 13 ( విజయ క్రాంతి ) :  పట్టణం పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఇంటి గ్రేటెడ్ వెజ్, అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం కలగా నే మిగిలి పోనున్నాదా... పట్టణ, గ్రామీణ వా సుల ఇక్కట్లు తీరడానికి పరిష్కారమే లేదా... అనేప్రశ్నలుతలెత్తుతు న్నాయి. ప్రస్తుతం మధ్యలోనే నిలిపివేసిన భవనాన్ని చూస్తుం టే నిజమేనేమో అనిపిస్తున్నది. ఏళ్లుగా సాగుతున్న ఇంటి గ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంపై ఏళ్లుగా నీలినీడలు కమ్ముకున్నాయి.

ఇంటి గ్రేటెడ్ మార్కెట్ కలేనా..

మండలంలోని ప్రజలు, చిరువ్యాపారుల బాధలతో చలించిన నాటి రాష్ట్ర ప్రభుత్వ వి ప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక చొరవతో మున్సిపల్ వాసులు, చుట్టుపక్కల గ్రా మాల ప్రజలకు ఇబ్బందులు తలెత్త కూడదనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీనగర్ లో ఇం టిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ని ర్మాణానికి నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీ కారం చుట్టుంది. దీనికి రూ. 4.50 కోట్లు మంజూరు చేసింది. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు స్థలం కేటాయించి, 2021 జూలై 9 న అప్పటి ఎ మ్మెల్యే రేగా కాంతారావు శంకుస్థాపన చేశా రు. పనులు ప్రారంభించి స్లాబ్ వరకు ని ర్మాణం పూర్తి చేశారు. కానీ మధ్యలోనే పను లు అసంపూర్తిగా ఆగిపోయి పట్టణ వాసుల ఆశలు అడియాశలుగా, మార్కెట్ నిర్మాణం కలగానే మిగిలిపోయాయి.

నాడు సంతోషం... నేడు నిర్వేదం  

ప్రజలందరికీ సౌకర్యవంతంగా విశాలం గా ఉండాలనే ఉద్దేశంతో వ్యవసాయ మా ర్కెట్ ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణంతో చిరు వ్యాపారులు, ప్రజల సంతోషించారు. పట్టణ నడిబొడ్డున మార్కెట్ ఏర్పాటుకు అ ప్పటి ఎమ్మెల్యే కాంతారావు ప్రత్యక్ష, పర్యవేక్షణలో పనులు ప్రారంభమైన మొదట్లో వే గంగానే నడిచిన తరువాత అర్ధాంతరగా మ ధ్య లోనే ఆగిపోయి, మార్కెట్ ప్రాంగణం నే డు పిచ్చిచెట్లతో దర్శనమిస్తున్నాయి.

బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా చురుకుగా సాగి న పనులు ప్రభుత్వం మారడంతో ఎక్కడ వే సిన గొంగడి అక్కడే అన్న చందంగా మా రింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పను లు పూర్తయితే ఎన్నో సమస్యలకు పరిష్కా రం లభిస్తుందని వ్యాపారులు, ప్రజలు ఆశించారు. కానీ, నేడు ఆరంభసూరత్వంగానే ఆపనులు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. ఓ వైపు పనులలో జాప్యం, అసెంబ్లీ ఎన్నికలు రావడం, ప్రజాప్రతినిధులు, పాలక ప్రభుత్వాలు మారడంతో నేటి నాయకులెవరూ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీం తో వ్యాపారులు నిర్వేదం చెందారు. ప్రజల కు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. 

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా

ఆ భవన నిర్మాణం 90 శాతం పూర్తయినప్పటికీ, ఆచివరి దశ పనులు అర్ధాంతరం గా నిలిచిపోయాయి. దీంతో మార్కెట్ కోసం అద్యంతం ఎదురు చూసిన ప్రజలు తీవ్ర ని రాశ చెందుతున్నారు. మరో వైపు ఆ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలిచినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. ప్రభు త్వం మారి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు దీనిపై ఇంకా దృష్టి పెట్టలేదు.

కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మిస్తున్న భవనాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకుల పైన ఉంది. మరోవైపు తెలంగాణ చౌరస్తా, అంబేద్కర్ సెంటర్లలో వెజిటేబుల్ మార్కెట్ ఉండ గా అది అత్యంత ఇరుకుగా మారింది. పెరుగుతున్న జనాభా పార్కింగ్ ఇబ్బందులను అధిగమించాలంటే తొందరగా ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, దీ నిపై పాలకులు వెంటనే స్పందించి వాడుకలోకి తీసుకువచ్చే విధంగా నిర్మాణాలను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

త్వరితగతిన పూర్తి చేయాలి

ప్రజా అవసరాలను దృష్టి లో ఉంచు కొని గత ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో మార్కెట్ యార్డు కోసం నిధులు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ అర్ధాంతరంగా పనులను నిలిచివేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే నిలిచిన పనులు పూర్తయ్యేలా చూడాలి. సమీకృత మార్కెట్తో పట్టణ ప్రజలతో పాటు దుకాణదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు సైతం తొలగిపోతాయి. 

కర్నే రవి సామజిక కార్యకర్త  (మణుగూరు)