calender_icon.png 28 July, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా భద్రాద్రి బ్యాంక్ 28వ వార్షిక సర్వసభ్య సమావేశం

28-07-2025 12:28:50 AM

ఖమ్మం, జులై 27 (విజయ క్రాంతి): భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 28వ వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం సాయత్రం ఖమ్మంలో ఘనంగా జరిగింది. ఈ మహాజన సభకు బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు హాజరయ్యారు. విశిష్ట అతిథిగా జాయింట్ రిజిస్ట్రార్, జిల్లా సహకారశాఖ అధికారి గట్టు గంగాధర్ పాల్గొన్నారు.

బ్యాంక్ వైస్ చైర్మన్లు సన్నె ఉదయ్ ప్రతాప్, శ్రీ వేములపల్లి వెంకటేశ్వర రావు రిసెప్షన్ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు.ఈ సం దర్భంగా బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి 2024-25 ఆర్ధిక సంవత్సరానికిగానూ వార్షిక నివేదికను, 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన బడ్జట్ ను సభ్యుల ముందు ప్రవేశపెట్టి ఆమోదం పొందారు.  2024-25 ఆర్ధిక సంవత్సరానికిగానూ ముగిసిన మార్చ్ 31 నాటికి డిపాజెట్లు రు.598.96 కోట్లకుగానూ ఋణములు రు.365.99 క్కట్లకు గానూ బ్యాంక్ నికర లా భం రు.880.31 లక్షలుగా గానూ ఉన్నవని తెలిపారు.

ఇప్పటికి 23 శాఖలుగా విస్తరించినదనీ రాబోయే రోజులలో మరిన్ని శాఖలను ప్రారంభిస్తామనీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా బ్రాం చ్ లు ప్రారంభిస్తామనీ చెప్పారు. మొత్తం 23,537 మంది సభ్యులతొ మున్ముందుకు పొతున్నదని తెలియజేశారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర రావు మా ట్లాడుతూ భద్రాద్రి బ్యాంక్ క్రమశిక్షణతో అంచలంచలుగా ఎదుగుతూ రాష్టం లోని అర్బన్ బ్యాం కులలో ఒక అగ్రగామి బ్యాంకుగా ఎదిగిందనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్లు సన్నె ఉదయ్ ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వర రావు, బ్యాంక్ డైరెక్టర్లు దేవత రాజారావు, బులు సు సాంబమూర్తి, మద్ది పిచ్చయ్య, రాజ్ పురోహిత్ చెన్ సింగ్, వై.వి.యస్. రావు, రంగా నాగ శ్రీనివాస రావు, దారా జీవన్ రాం, కర్లపూడి నర్మద, కపిలవాయి జయప్రద, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యులు సి.జి. శాస్త్రి, పైడిమర్రి సత్యనారాయణ, ప్రొఫెసర్ పసుమర్తి మధుసూధన రావు, బ్యాంక్ అన్ని శాఖల మేనేజర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.