calender_icon.png 29 July, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి ప్రజల సమస్యల పరిష్కారానికి వేదిక

28-07-2025 10:56:30 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రజావాణి సమస్యల పరిష్కారానికి ఒక వేదిక అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్(District Collector Ashish Sangwan) అన్నారు. ప్రజావాణి ద్వారా వచ్చిన అర్జీలను తక్షణమే పరిశీలించి, శనివారంలోగా పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఐడిఓసి సమావేశ మందిరంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్ లతో కలిసి ప్రజల నుండి వివిధ సమస్యలపై వచ్చిన 124 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యమైన వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. వచ్చిన ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు న్యాయం కలిగించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవోతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.