28-07-2025 11:20:21 PM
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్(former government whip Gampa Govardhan) సోమవారం మాజీ ఎంపీపీ ఆంజనేయులు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఆయన వెంట మాజీ జెడ్పిటిసి గండ్ర మధుసూదన్ రావు, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, అధికార ప్రతినిధులు గైని శ్రీనివాస్ గౌడ్, బల్వంత్ రావు, బిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.