28-07-2025 11:04:03 PM
ఏరియా జిఎం జి దేవేందర్..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం ఏరియాకు నిర్దేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(AITUC) సహకరించాలని ఏరియా జిఎం జి దేవేందర్(Area GM G Devender) కోరారు. ఏరియాలోని జిఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీతో 8వ ఏరియా స్థాయి స్ట్రక్చరల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా ఏరియా మాట్లాడుతూ, సింగరేణి అభివృద్ధిలో, బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలో కార్మిక సంఘాల పాత్ర కీలకమైనదని తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి, ఉత్పాదకతలోనే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా గడిచిన స్టృక్చరల్ సమావేశాలలో జరిగిన పనుల పురోగతిని చర్చించారు.
గుర్తింపు సంఘ నాయకులు ప్రస్తావించిన పనులను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, ఈ సమావేశంలో యాజమాన్యం తో 16 డిమాండ్లపై చర్చించడం జరిగిందన్నారు. ప్రధానంగా ఏరియాలో ఖాళీగా ఉన్న టెండాల్స్, టెండాల్స్ సూపర్వైజర్లు, ఇతర ఖాళీలను భర్తీ చేయడానికి యాజమా న్యం అంగీకరించిందన్నారు. అదేవిధంగా కార్మికులకు నాణ్యమైన బూట్లు, రెయిన్ కోట్ లతో పాటు కార్మిక కాలనీల సమస్యలైనా కార్మిక క్వార్టర్ల మరమ్మత్తులు, వైరింగ్ పనులు త్వరగా నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. తొందరగా కార్మిక కాలనీలో ఎల్ఈడి స్ట్రీట్ లైట్లు బిగించడానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు. కార్మికులకు నాణ్యమైన డ్రిల్ రాడులు, బ్లాస్టింగ్ ఎక్స్ ప్లోడర్ లు ఇవ్వడానికి యాజమాన్యం సమావేశంలో అంగీకారం తెలిపిందని తెలియజేశారు.
ఏరియా వర్క్ షాప్ లో మిషన్ షాఫ్ట మిషన్ లు కార్పొరేట్ కు పంపి, కొత్తవి కొనుగోలు చేయడానికి యాజమాన్యం సమావేశంలో తన అంగీకారం తెలిపిందన్నారు. మిగిలిన సమస్యలను తొందరగా పరిష్కరించేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఎం స్థాయి స్ట్రక్చరల్ కమిటీ సభ్యులు యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, రామకృష్ణాపూర్ బ్రాంచ్ కార్యదర్శి అక్బర్ అలీ, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్, నాయకులు టేకుమట్ల తిరుపతి, తిరుపతి గౌడ్, ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, ఏజెంట్ ఖదీర్, కేకే ఓసిపి ప్రాజెక్ట్ అధికారి మల్లయ్య, ఏరియా స్టోర్స్ డిజిఎం సురేష్, ఇంచార్జ్ ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవతి జా, ఐఈడి ఎస్ఈ కిరణ్ కుమార్, సివిల్ ఎస్ఈ రాము, వర్క్ షాప్ డిజిఎం దూప్ సింగ్, డివైపిఎం సందీప్, ఏరియా ఉన్నతాధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.