28-07-2025 10:58:48 PM
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో నిధులు మంజూరు..
ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): ఎల్లారెడ్డిపేట మండలం(Yellareddipet Mandal)లోని కోరుట్లపేట గ్రామ గంగమ్మ గుడి వద్ద కల్వర్టు నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే కోరుట్ల పేటకు చెందిన మేడిపల్లి సత్యం చొరవతో 12 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. వర్షాకాలంలో భారీ వర్షాలు పడినప్పుడు అక్కడి లో లెవెల్ బ్రిడ్జి పైనుండి వరద నీరు ప్రవహిస్తూ ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉండేది. ఈ ప్రాంతంలో కల్వర్టు నిర్మాణం చేయాలని భావించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్స్ డి ఎం ఎఫ్ నిధులు 12 లక్షలు మంజూరు చేయించి కల్వర్టు నిర్మాణానికి సహకరించారు. ఈ సందర్భంగా రేవంత్ మిత్ర మండలి అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడిపల్లి దేవానందం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేడిపల్లి రవీందర్, అహ్మద్ తో పాటు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.