28-07-2025 11:07:51 PM
మందమర్రి (విజయక్రాంతి): చెన్నూరు నియోజకవర్గంలో రైతులను నిలువు దోపిడి చేస్తున్న ఫర్టిలైజర్ షాప్, డిసిఎంఎస్ షాప్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జన సమితి నాయకుడు బచ్చలి ప్రవీణ్ కుమార్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జుమ్మిడి గోపాల్ లు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, చెన్నూరు నియోజకవర్గంలోని ఫర్టిలైజర్ షాప్, డిసిఎంఎస్ షాప్ యాజమానులు యూరియా, డిఏపి, ఎరువులను అధిక ధరలకు అమ్ముతూ, పేద రైతులను నిలువు దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. రైతులను దోచుకుంటున్న ఫర్టిలైజర్ షాప్, డిసిఎంఎస్ షాప్ యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే నియోజకవర్గం వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ గణపతి పాల్గొన్నారు.