calender_icon.png 1 May, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది ఫలితాలలో భగవతి, ఆర్విన్ ట్రీ విద్యార్థుల ప్రతిభ

01-05-2025 01:27:17 AM

కరీంనగర్, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నగరంలోని భగవతి , ఆర్విన్ ట్రీ పాఠశాలల విద్యార్థులు రాష్ర్ట స్థాయి మార్కులతో  ప్రతిభ చాటారు. హె. మనస్విత శ్రీ 578 , వి. సుశ్రుత్ 577 , కె. వైష్ణవి 575 , ఎం. సాయి అక్షయ రెడ్డి 574 , జి. రవి చంద్ర 573 , ఎ. చరణ్ 572 మార్కులు సాధించారని పాఠశాలల ఛైర్మన్ బి. రమణ రావు తెలిపారు.  ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్ తో పాటు డైరెక్టర్ బి. విజయలక్ష్మి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పది ఫలితాల్లో పారమిత విద్యార్థుల ప్రతిభ

కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్30: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి వార్షిక ఫలితాల్లో స్థానిక నగరంలోని పాఠమిత ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. ఈ ఫలితాలు కేవలం పారమితకు సంబంధించిన ఒకే పాఠశాలది. ఇట్టి ఫలితాలలో 577 మార్కులతో రామోజుల సాయీశ్వర్, 573 మార్కులతో గంగిల  సాన్విత్ రెడ్డి , 571 మార్కులతో ఉమ్మెంతుల మనస్విని, 570 మార్కులతో అగస్త్య మహావీర  అత్యధిక మార్కులు  సాధించారు.

550 ఆపైన మార్కులతో 39 మంది విద్యార్థులు, 500 మార్కులు ఆపైన 131 మంది విద్యార్థులు ఫలితాలు సాధించగా, 100% ఉత్తీర్ణతో పారమిత విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యా యులు సి.హె. బాలాజీ తెలిపారు. పారమిత విద్యాసంస్థలలో నైపుణ్యాలకు పెద్దపీట వేసి ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని తట్టుకునే విధంగా విద్యార్థులను అన్నిరంగాలలో తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ పద్దతిలో ఎక్కడా కూడా అధిక మార్కులు సాధించడానికి విద్యార్థులను బట్టి విధానానికి ప్రోత్సహించడం జరగదు.

అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పారమిత పాఠశాలల అధినేత డా? ఇ. ప్రసాద రావు, డైరెక్టర్లు ప్రసూన,  అనుకర్ రావు, రశ్మిత, రాకేష్, ప్రాచీ, వినోదరావ్, వి.యు. ఎం. ప్రసాద్, టి.ఎస్వి. రమణ, హన్మంతరావు ప్రధానోపాధ్యాయులు బాలాజీ, ప్రశాంత్, కవిత ప్రసాద్,  సమన్వయకర్త శ్రీనాథ్ మరియు ఉపాధ్యాయలు అభినందించారు. పాఠశాలకు ఉత్తమ సహకారాన్నందిచిన తల్లి తండ్రులకు చైర్మన్ డా. ఇనుగంటి ప్రసాద రావు కృతజ్ఞతలు తెలియజేశారు.