01-05-2025 01:28:04 AM
ఆ శాఖ కమిషనర్ సీ.హరికిరణ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30(విజయక్రాంతి) : ఎక్సైజ్ శాఖ వి.బి కమ లాసన్‌రెడ్డి అనే మంచి అధికారిని కోల్పోయిందని ఆ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ కొనియాడారు. ఎక్సైజ్ శాఖ ప్రతిష్ఠను పెంచేందుకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా కమలాసన్‌రెడ్డి మంచి కృషి చేశార న్నారు.
వీబీ కమలాసన్‌రెడ్డి మరో శాఖకు బదిలీపై వెళ్లడంతో నగరంలోని గోల్కొండ హోటల్‌లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో కమిషనర్ హరికిరణ్ మాట్లాడుతూ కమలాసన్‌రెడ్డితో పని చేసిన ఆరు నెలల్లో ఆయన డెడికేషన్ తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.
కాగా టీజీబీసీఎల్ జనరల్ మేనేజర్‌గా పని చేసిన అబ్రహాం బుధవారం పదవీ విరమణ పొందారు. ఆయనకు ఎక్సై జ్ శాఖ కార్యాలయంలో వీడ్కోలు సమావేశంలో ఆయనను ఎక్సైజ్ శాఖ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసీన్ ఖురేషీ, జేసీ కేఏబీశాస్త్రీ, డీసీలు దశరథ్, రఘురాం, శ్రీనివాస్, అనిల్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.