19-11-2025 08:52:38 PM
నిజామాబాద్ (విజయక్రాంతి): నేడు గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆదేశాల మేరకు ప్రపంచ లైంగిక దుర్వినియోగం, వేధింపులు హింస నివారణ, కోలుకొనడం దినోత్సవం సందర్భంగా భరోసా సెంటర్ ధర్మారం రెసిడెన్షియల్ స్కూల్ బాలికలకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించించారు. ఈ కార్యక్రమానికి అదనపు డీసీపీ (అడ్మిన్)బస్వరెడ్డి హాజరై, బాలికలను లక్ష్యాలపై దృష్టి పెట్టి విజయవంతంగా ఎదగాలని ప్రోత్సహించారు. ఎలాంటి సమస్య వచ్చినా భయపడి కాకుండా పోలీసులను సంప్రదించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో SI పుష్పావతి, కోఆర్డినేటర్ రోజా, లీగల్ సపోర్ట్ పర్సన్ డయానా, సపోర్ట్ పర్సన్ మౌనిక, షీ టీమ్స్ SI శ్రావంతి, ఇతరులు పాల్గొన్నారు. భరోసా సేవలు దినోత్సవ ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు.