calender_icon.png 19 November, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధులు మంజూరు చేయాలని వినతి..

19-11-2025 08:45:35 PM

ఉప్పల్ (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ బుధవారం కలిసి వినపత్రం అందించారు. డివిజన్లోని సమస్యలను కార్పొరేటర్ శాంతి కమిషను దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తుచ తప్పకుండా నెరవేర్చడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు.

ప్రధానంగా రైతు బజార్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం అన్నపూర్ణ కాలనీ హెచ్ఎంటి కాలనీ పెద్ద చెరువు బఫర్ జోన్ థీమ్ పార్క్ ఎర్రకుంట స్మశాన వాటిక వైకుంఠధామగా తీర్చే విషయంపై కమిషనర్ తోని మాట్లాడానన్నారు. పటేల్ కుంట చెరువు పక్కనుండి కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సివర్ లైన్ డైవర్షన్ పనులు కూడా ఇంకో పది శాతం మిగిలి ఉన్నాయి అని నిధులు మంజూరు అయితే అట్టి పనులు కూడా పూర్తి అవుతాయని కమిషనకు తెలియజేశామని ఆమె పేర్కొన్నారు. అన్ని విషయాలపై కమిషనర్ సానుకూలంగా స్పందించి కాప్రా  జోనల్ కమిషనర్  కు సమస్యలు పరిష్కారంచాలి ఆదేశాలు జారీ చేశారని కార్పొరేటర్ శాంతి తెలిపారు.