calender_icon.png 19 November, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధురాలికి అంత్యక్రియలు

19-11-2025 08:43:03 PM

582 అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన ఎండిఆర్ ఫౌండేషన్

పటాన్ చెరు: నిత్యం సమాజ సేవలో తమదైన స్థానాన్ని నిలబెట్టుకున్న ఎం డి ఆర్  ఫౌండేషన్ ఇప్పటివరకు సుమారు 582 అనాధలకు అంత్యక్రియలు నిర్వహించింది. అలాగే ఎంతో మంది పేద, అభాగ్యులకు ఆర్థిక సహాయం, రేషన్ కిట్లు అందిస్తూ సేవలను కొనసాగిస్తోంది. ఈ సేవా కార్యక్రమాల భాగంగా,  ఎం డి ఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్  ఆర్థిక సహకారంతో మరో అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. పటాన్ చెరు నూతన మార్కెట్ సమీపంలో చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక వృద్ధురాలు కిందపడిన విషయం తెలిసిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో, ఆమెను ప్రభుత్వం ఆసుపత్రిలో చేరదీశారు. చికిత్స పొందుతూ ఆమె మరణించగా, ఆ వృద్ధురాలికి సంబంధించిన వారు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఎం డి ఆర్ ఫౌండేషన్ ఆమెకు అంత్యక్రియలను బాధ్యతగా నిర్వహించింది.