calender_icon.png 19 November, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం

19-11-2025 08:50:29 PM

కుభీర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని నిఘ్వ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ చైర్మన్ కడారి నరేష్ సహకారంతో రూ. 10 వేలు విలువ చేసే టై,బెల్ట్, ఐడి కార్డులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఆర్. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎన్జీవోలు, ప్రజల భాగస్వామ్యం కీలకమని, సమాజ భాగస్వామ్యంతోనే పాఠశాలలు బలోపేతం అవుతాయని అన్నారు. తమవంతుగా సహకారం అందిస్తున్న ఎన్జీవోల పాత్ర అభినందించదగినదని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నాంపల్లి నాగభూషణ్, తపస్ జిల్లా గౌరవ అధ్యక్షులు జిలకరి రాజేశ్వర్, హెచ్ ఎం స్వరూప, ఉపాధ్యాయులు ప్రవళిక, సంధ్యారాణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.