19-11-2025 09:58:03 PM
నూతన ఎస్సైగా శంకర్ నియామకం..
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దముల్ సబ్ ఇన్స్పెక్టర్ వేణు కుమార్ పై బదిలీ వేటు పడింది. ఇటీవల ఓ హత్య కేసు విచారణ కోసం ఓ వ్యక్తిని చితకబాదినట్లు ఆరోపణలు రావడంతో ఆయనను బషీరాబాద్ కు బదిలీ చేసినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే రిజర్వ్ లో ఉన్న శంకర్ ను పెద్దేముల్ నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.