19-11-2025 09:50:14 PM
అంబరాన్నంటిన కార్తీక దీపోత్సవ వేడుకలు..
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కోవలక్ష్మి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక దీపోత్సవం మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగింది. లక్షట్ పేటకు చెందిన ప్రణవ్ శర్మ ఆధ్వర్యంలో 18 మంది వేద పండితులు ప్రత్యేక శివలింగార్చన గణపతి పూజ చేయడంతో పాటు దీపార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పూజలో ఎమ్మెల్యే కోవలక్ష్మి, కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం కార్తీకదీపోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజల సంక్షేమమే లక్ష్యమని వివరించారు. దీపార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున హాజరై దీపాలు వెలిగించారు.