calender_icon.png 19 November, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దమందడి ఎస్సీ హాస్టల్ వార్డెన్ విద్యావతిని సస్పెండ్ చేయాలి

19-11-2025 09:13:23 PM

పెద్దమందడి: విద్యార్థులతో వెట్టిచాకిరి చేయించుకుంటూ విద్యార్థుల సొమ్ము కాజేస్తున్న వార్డెన్ విద్యావతిని సస్పెండ్ చేయాలనీ కోరుతు బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ కు పి డి ఎస్ యు నాయకులు వినతి పత్రంను అందచేశారు. ఈ సందర్బంగా పి డి ఎస్ యు నాయకులు మాట్లాడుతు... విద్యార్థులకు రావాల్సినటువంటి కాస్మోటిక్ చార్జీలు 85 రూపాయలు మాత్రమే ఇస్తూ మిగతా డబ్బులు కాజేస్తున్నారని గతంలో అనేక సార్లు వార్డెన్ పై పిర్యాదు చేసిన ఉన్నతాధికారులు పట్టించుకోలేదన్నారు. పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పవన్ కుమార్ బి జి వి ఎస్, రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. ఆది హిందువాహిని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అభిలాష్  సంఘాల నేతలు పాల్గొన్నారు.