calender_icon.png 19 November, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన సదస్సు

19-11-2025 08:48:22 PM

కుభీర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు నిఘ్వ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆర్ టి ఐ(RTI) సామాజిక కార్యకర్తల ఫోరం తెలంగాణ ఆధ్వర్యంలో "సమాచార హక్కు చట్టం" పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సయ్యద్ కలీం మాట్లాడుతూ విద్యార్థులు సమాచార హక్కు చట్టం పై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని దరఖాస్తు చేసే విధానం మొదటి ఆప్పీలు రెండవ అప్పీలు ఎలా చేయాలి అనే పరిజ్ఞానం కలిగి ఉంటే పారదర్శకత జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు.

ప్రతి భారతీయ పౌరుడు ఈ చట్టాన్ని వినియోగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందే విధంగా కృషి చేయాలని తెలిపారు. లోకాయుక్త చట్టం, వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్, హెచ్ ఎం గంగాధర్, సారంగాపూర్ మండల బాధ్యులు సయ్యద్ ఆబిద్ అలీ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.