calender_icon.png 19 November, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్జాగా నకిలీ పత్రాల తయారీ నకిలీ డాక్యుమెంట్లతో దందా

19-11-2025 09:50:00 PM

తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ కు 46 లక్షల కుచ్చుటోపి       

నిజామాబాద్ (విజయక్రాంతి): అమాయకులను నమ్మించినకిలీ డాక్యుమెంట్లో చూపించి డబ్బులు దండుకోవడం ఇతడికి వెన్నతో పెట్టిన విద్య. ఈ ఘరానా మోసగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు నిజామాబాద్​కు చెందిన నబీకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందల కొద్ది మంది ఇతగాడి బాధితులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. డాక్యుమెంట్​ రైటర్​ అవతారంలో రోజుకో తరహాలో వరుస మోసాలకు పాల్పడుతున్నాడు. తాజాగా.. ఓ చీటింగ్​ కేసులో నిజామాబాద్​ నాలుగో టౌన్ పోలీస్ పట్టుకున్నారు. నమ్మించి మోసం చేయడం ఇతడికి వెన్న తోలు పెట్టిన విద్య తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్న కనకయ్య నిజామాబాద్​ నగరంలోని నాలుగో టౌన్​ పరిధిలో నివసిస్తున్నాడు.

బోర్గాం(పి) గ్రామానికి చెందిన చిలుక సాయిలు, షేక్​ అహ్మద్​ నబీ ఫేక్​ డాక్యుమెంట్​ రైటర్​ పరిచయమయ్యారు. వ్యవసాయ భూమి కొనుగోలు చేయిస్తామని తమ వద్ద ఉన్న వివిధ స్థిరాస్తుల తాలూకు పొలాల తాలూకు డాక్యుమెంట్ చూపించారు. అందులో నుండి ఒక వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్ల తాలూకు డీల్ కుదిరించారు. దీంతో కనకయ్య వారికి 2022లో రూ. 46 లక్షలు వారికి ఇచ్చారు. డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ప్రొఫెసర్​ కనకయ్యకు అంటగట్టారు. తీరా తాను మోసపోయానని గుర్తించిన కనకయ్య వారిని డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగాడు. డబ్బులు ఇవ్వకపోగా.. కాలయాపన చేసి బెదిరింపులకు పాల్పడడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.

నిందితులిద్దరి రిమాండ్​ ప్రొఫెసర్​ కనకయ్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన నాలుగో టౌన్​ ఎస్​హెచ్​వో ఎస్​.సతీశ్​ కుమార్​ ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు. గతంలోనూ నబీ మోసాలు తనకు తాను డాక్యుమెంట్​ రైటర్​గా ప్రచారం చేసుకుని గతంలో నబీ ఎన్నో మోసాలకు పాల్పడ్డాడు. నకిలీ పత్రాలను సృష్టించి అమాయకుల నుంచి రూ. లక్షలు వసూలు చేశాడు. లేని భూమికి రిజిస్ట్రేషన్​ చేసి పెట్టి ఎంతో మందిని మోసగించాడు. గతంలో కామారెడ్డి పట్టణ పోలీసులు  ఇతడిని అరెస్ట్​ చేసి జ్యుడీషియల్​ రిమాండ్​కు తరలించారు. అయినా తీరు మార్చుకోకపోగావరుస మోసాలకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.