13-11-2025 04:35:43 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆయురారోగ్యాలతో ఉండాలని గురువారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, మాజీ జెడ్పిటిసి కారుకూరి రామ్ చందర్, టిపిసిసి ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దావ రమేష్ లు ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేడుకున్నారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు భూమన్న, మహేష్ తదితరులు ఉన్నారు.