calender_icon.png 13 November, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో బీసీల ధర్మ పోరాట దీక్ష

13-11-2025 04:40:44 PM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో గురువారం బీసీల ధర్మ పోరాట దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ జేఏసీ నాయకులు మాట్లాడారు. బీసీ లకు ఉద్యోగ విద్య రాజకీయ రంగంలో 42 శాతాన్ని పెంచడానికి పార్లమెంటులో సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు అన్ని రంగాలలో 42 శాతం రిజర్వేషన్ పెంచాలని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని లేకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున అన్ని కుల సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తామని బీసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సాప శివరాములు, చాకలి రాజయ్య, కుంభాల లక్ష్మణ్ యాదవ్, సబ్బని కృష్ణ హరి, తదితరులు పాల్గొన్నారు.