calender_icon.png 13 November, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు...

13-11-2025 04:29:16 PM

నిర్మాణమైన ఏదైనా కార్పొరేట్ టాక్స్ కట్టాల్సిందే..

మల్లాపూర్ కార్పొరేటర్ పై విమర్శలు వెల్లువ..

ఉప్పల్ (విజయక్రాంతి): నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా ఉంది మల్లాపూర్ కార్పొరేటర్ పరిస్థితి. నిర్మాణం ఏదైనా సరే తన టాక్స్ తనకు పంపియాలని స్థానిక ప్రజలను ఇబ్బందులు గురిచేస్తారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ టిఆర్ఎస్ కార్పొరేటర్ రోజు వివాదానికి తెరతీస్తుంది. చిన్నచిన్న నిర్మాణాలు చేపడుతున్న పేద ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బందిగా గుర్తు చేస్తున్నారని  పలుగురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో  దత్తాత్రేయ నగర్ లో కూడా  ఓ చిన్న స్థలం వివాదంలో  కార్పొరేటర్ జోక్యం చేసుకొని  డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు బాధితులను బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. 110 సర్వే నెంబర్ మల్లాపూర్ ఓల్డ్ విలేజ్ లో కూడా 97 గజాల సంబంధించిన స్థలం యజమానిని డబ్బులు డిమాండ్ చేయగా ఇవ్వకపోయేసరికి ఏకంగా పట్టా ఉన్న ప్రభుత్వ భూమి అంటూ ప్రహరి నిర్మాణం చేపట్టేందుకు  ప్రయత్నించడంతో ఒక్కొక్క వివాదం తెరమీదకి వస్తుంది.

గతంలో 2 నెల క్రితం ఓ కాంట్రాక్టర్ సైతం కార్పొరేటర్ అవినీతిపై  తీవ్ర విమర్శలు చేశారు. నల్ల కలెక్షన్ మొదలు అన్ని ఆయన అనుమతి తీసుకున్నకే మొదలుపెట్టాలని అనుమతి కోసం  ఇంత డబ్బు డిమాండ్ చేసిన తదుపరి ఇస్తేనే పనులు జరుగుతాయని లేనియెడల పనులు నిలిచిపోతాయంటూ స్థానికులు వాపోతున్నారు. బుధవారం నాడు కూడా ఇదే జరగడంతో స్థానికులు కార్పొరేటర్ అరాచకులపై  ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని బాధితులు  తమ గోడను వెళ్లబోచుకుంటున్నారు. బాధితుల ఎవరైనా తిరగబడితే  తన బూతు పురాణం  బెదిరింపులు దిగడవే కాకుండా మున్సిపల్ అధికారులతో కుమ్మక్కైన కార్పొరేటర్  మా యొక్క ఇల్లును కూల్చి  చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని  స్థానికులు వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పోలీసుల ముందే  కార్పొరేటర్ బాధితులను బెదిరింపులకు పాల్పడ్డారంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికైనా టిఆర్ఎస్ అధిష్టానం కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని  పలువురు కోరుతున్నారు