22 August, 2026 | 4:02 AM

జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు భవాని ఎంపిక

22-08-2026 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రాష్ట్రం నుంచి ఒకరు ఎంపికయ్యారు. కేంద్రం మొత్తం వివిధ రాష్ట్రాల నుంచి 48 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి కామారెడ్డి జిల్లా గాంథారి ఎంపీపీఎస్ పాఠశాలకు చెందిన భవాని బొంపెల్లి ఎంపికయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి చిన్నమల్లుపేట ఎంపీపీఎస్ పాఠశాలకు చెందిన రాజేష్ కౌలూరి ఎంపికయ్యారు.