రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
22-08-2026 12:00 AM
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురువనున్నాయి. అదేవిధంగా 30-40 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది.






