calender_icon.png 6 July, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చల్లనితల్లి సీత్లా భవానీ!

06-07-2025 12:58:45 AM

  1. లంబాడీల ప్రకృతి ఆరాధ్య పండుగ

పశుసంపదను రక్షించాలని అమ్మవారికి పూజలు

పిల్లాపాపలు, పంటలు బాగుండాలని, దుష్టశక్తులు తండాల్లోకి రావొద్దని మొక్కులు 

గిరిజన ఆచార సంప్రదాయాలతో అరుదైన సంబురం

ఆషాడ, శ్రావణ మాసాల్లో తండాల్లో ఆధ్యాత్మిక సందడి

మఠంపల్లి, జూలై 5: ప్రకృతి వేడుక సీత్లా భవానీ పండుగ. పశుసంపద రక్షణకు ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న ఆచారం. ఇదే దాటుడు పండుగగా స్థానికంగా ప్రసిద్ధి. ఆషాడం, శ్రావణమాసం వచ్చిందంటే చాలు లంబాడీ తండాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. తండా పెద్ద నాయక్ అనుమతితో లంబాడీల ఆరాధ్యదైవం సీత్లా భవానీని పూజించడం ఆనవాయితీ.

పెద్ద పుష్యమి (పూసల), చిన్న పుష్యమి కార్తె మొదటి మంగళ వారం ఈ పండుగను జరుపుకుంటారు. వర్షాకాలంలో మనుషులకు, పశువులకు అంటువ్యాధులు రాకుండా తమను సీత్లా భవానీ తల్లి రక్షిస్తుందని లంబాడీల విశ్వాసం. తెలుగువారు పోచమ్మ దేవతను ఆరాధ్యదైవంగా భావించినట్లే లంబాడీలు సీత్లా భవానీని ఆరాధిస్తారు.

తండాకు తూర్పు దిక్కున..

ప్రతీ తండా నుంచి తూర్పు దిక్కున ఉండే ఒడ్డున నిర్వహిస్తారు. ఏడుగురు అక్కాచెల్లెళ్లలో సీత్లా భవానీ అందరికంటే చిన్నది. సీత్లా మాత ప్రతిమ మధ్య భాగంలో మిగతా భవానీలు ఇరువైపులా ముగ్గురు అక్కల చొప్పున ఉండేలా ఒక వరుసలో చెట్టుకింద ప్రతిమలను ప్రతిష్ఠిస్తారు.

పొడవాటి రాళ్లతో తయా రుచేసిన ప్రతిమల మధ్యలో ఉండే సీత్లా భవానీని మిగతా వాటికంటే పెద్దదిగా ఉండేటట్లు చూస్తారు. ఏడుగురు భవానీల ప్రతిమల ఎదురుగా కొద్దిదూరంలో లూన్కడి యా పేరిట ఇంకో రాయితో చేసిన ప్రతిమల ను భవానీల వైపు చూసేలా ప్రతిష్ఠిస్తారు. లూన్కడియా ప్రతిమ మీదపడ్డ నీరు గుంత లో పడేలా  ఎదురుగా గుంత తీస్తారు.

తల్లికి నైవేధ్యంగా గుగ్రీ..

సీత్లా పండుగను అన్ని పండుగల్లా ఇంటి వద్ద కాకుండా తండా  బయట నిర్వహిస్తారు. ఆ రోజు సీత్లా భవానీ పూజలు అయ్యేవరకు గ్రామపెద్దల్లో ఒకరు ఉపవాసం ఉంటారు. ఆయన అందరికంటే ముందే పూజ ప్రదేశానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి గోవు పేడతో అలికి బియ్యం పిండితో గుండ్రంగా ముగ్గులు వేస్తా రు. తర్వాత భవానీ ప్రతిమల కు గేరు(జాజు) పూసి పూలు, మామిడి ఆకులతో అలంకరిస్తారు.

రైతులు తమ పశువుల ను ముస్తాబు చేసి దాటుడు కోసం తయారు చేసుకుంటారు. ఒక రోజు ముందు అనగా సోమవారం సాయంత్రం జొన్నలు పప్పుధాన్యాలు కలిపి నానబెట్టిన తర్వాత తయారైన గుగ్రీని (గుగ్గిళ్లను) మంగళవారం జరిగే సీత్లా భవానీకి నైవేధ్యంగా తీసుకెళ్తారు. దీనినే వాసి డో అంటారు.

వీటితో పాటు పాయసం, తెల్ల అన్నం, ఎండు మిర్చి, ఉల్లిగడ్డ, చింతపండు, రూపా యి బిల్లతో కాకోటి (ఒక వెడల్పాటి చెక్కతో చేసిన పాత్ర)లో పోసి దానిపై పూల్య గోనోతో కప్పి తండాలో ఉన్న పెళ్లి కాని అమ్మాయిలు తలపై మోసుకొని సీత్లా భవా నీ ప్రదేశానికి డప్పు, వాయిద్యాలతో తండా ప్రజలందరు ఊరేగింపుగా వస్తారు. అనంత రం సామూహికంగా మొక్కులు చెల్లించి సీత్లా భవానీకి మేకపోతులను, కోళ్లను బలి ఇస్తా రు. ‘వర్షాలు సకాలంలో కురువాలి..

పాడి పంటలు బాగా పండాలి.. రైతులు సంతోషం గా ఉండాలి.. తండా పొలి మేర దాటి ఎలాం టి దుష్టశక్తులు రావద్దు..’ అని మేకపోతుల రక్తాన్ని గుగ్గిళ్లలో కలిపి పశువులకు ఎ లాంటి అంటురోగాలు రాకుండా వాటి మీద చల్లుతా రు. తండా పూజారితో ఏడుగురు అక్కాచెల్లెళ్ల ఆశీర్వచనం ప్రజలు తీసుకుంటారు.

తల్లి దీవెనలు తండాపై ఉండాలని..

సీత్లా భవానీ పండుగ పురాతన కాలం నుంచి జరుపుకుంటున్నాం. పశుసంపద, ప్రజలకు ఎలాంటి అంటురోగాలు రావొద్దని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆ సీత్లా భవానీని పూజిస్తాం. ఆ తల్లి దీవెనలు తండా వాసులపై ఉంటాయనే నమ్మకంతో కోళ్లు, మేకలు బలి ఇచ్చి మొక్కులు చెల్లిస్తాం.       

 చంద్రునాయక్ (పూజారి, గ్రామ పెద్ద నాయక్)