14-01-2026 09:16:03 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం సంక్రాంతి సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో తెల్లవారు జామునే మహిళలు ఇంటి ముంగిట రంగురంగులతో ముగ్గులు వేసి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. అనంతరం భోగిమంటలు వేసి మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తమ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలగాలని అగ్ని దేవునితో పాటు దేవదేవుల్ని ప్రార్థించారు.