02-07-2025 01:48:04 PM
ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నిరుపేదలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు చేయూతగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతోందని స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గం బిజినపల్లి మండలంలోని పాలెం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటి నిర్మాణం మధ్యలో వదిలేసినా నిధులు మంజూరయ్యే అవకాశం లేదన్నారు. వారితోపాటు అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.