02-07-2025 01:36:46 PM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పటాన్ చెరు మండలం పాశమైలారం ప్రమాద ఘటనపై సిగాచీ పరిశ్రమ(Sigachi Industry Statement) బుధవారం కీలక ప్రకటన చేసింది. ప్రమాదంలో 40 మంది మరణించినట్లు సిగాచీ పరిశ్రమ తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని సిగాచీ పరిశ్రమ ప్రకటనలో పేర్కొంది. గాయపడిన వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామన్నారు. గాయపడిన కార్మికులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని పరిశ్రమ స్పష్టం చేసింది. సిగాచీ పరిశ్రమ తరపున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ప్రకటించారు.
ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు(Stock Markets) కంపెనీ సెక్రటరీ లేఖ రాశారు. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని సిగాచీ పరిశ్రమ తెలిపింది. ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని సిగాచీ పరిశ్రమ పేర్కొంది. పరిశ్రమలో 3 నెలల పాటు కార్యకలాపాలు నిలిపి వేస్తున్నామని వెల్లడించింది. కార్మికులకు అన్ని రకాల బీమా క్లెయిమ్ లు చెల్లిస్తామని సిగాచీ సంస్థ(Sigachi Industries Ltd) హామీ ఇచ్చింది. క్షతగాత్రుల వైద్యఖర్చలు భరిస్తాం, వారి కుటుంబపోషణ చూస్తామని ప్రకటించింది. సిగాచీ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ మృతదేహాన్ని తీసుకెళ్తేందుకు సిగాచీ పరిశ్రమ డైరెక్టర్ చిదంబరం పటాన్ చెరులోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు.