01-05-2025 01:35:35 AM
తాడ్వాయి, ఏప్రిల్, 30: భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ తెలిపారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూభారతి చట్టంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెక్షన్ 4 ప్రకారం హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు, భూమి హక్కు లు ఉండి రికార్డులో లేని వారికి నమోదు చేయడం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సెక్షన్ 5 ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లు మ్యూటేషన్ చేసుకోవచ్చని తెలిపారు .
సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందన్నారు తాసిల్దార్ ఇచ్చిన పాస్ పుస్తకాలపై అభ్యంతరం ఉంటే ఆర్డిఓకు కలెక్టర్కు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు రైతులు తమ సమస్యలపై భూభారతిలో పరిష్కారం పొందవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో వీణ,ఎంపీడీవో సాజిద్ అలీ సింగల్ విండో చైర్మన్ కపిల్ రెడ్డి తహసిల్దార్ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు