01-05-2025 01:38:46 AM
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జనాభా లెక్కల్లో భాగంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షనీయమని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. కులగణనతో తెలంగాణలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారని తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. రాహు ల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్, మంత్రుల బృందం నిర్ణయం తీసుకొని పారదర్శకంగా కులగణన సర్వే నిర్వహించిందన్నారు.
కులగణన లెక్క ల ఆధారంగా తెలంగాణలో బడు గు బలహీన వర్గాలకు సామాజిక న్యా యం చేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిం దన్నారు. కులగణనను అపహాస్యం చేసిన బీజేపీ ఇప్పుడు దారిలోకి రావడం శుభ పరిణామన్నారు.