calender_icon.png 1 May, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22న కరీంనగర్‌లో హిందూ ఏక్తాయాత్ర

01-05-2025 01:35:08 AM

కరీంనగర్, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే హిందూ ఏక్తా యాత్రను ఈ నెల 22న కరీంనగర్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్లో హిందూ ఏక్తాయాత్ర పోస్టర్ను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు కరినగర్ విభాగ్ సహాయ సంఘ చాలకులు డాక్టర్ సీహె రమణాచారి, విశిందూ పరిషత్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇ మధుసూదన్రావులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్ వై సునీల్రావు, డి శంకర్, వాసాల రమేసవ్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్, మాజీ కార్పొరేటర్ వంగల పవన్, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్రావు, కన్నబోయిన ఓడెలు, కొట్టె మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కరండ్ల మధుకర్, పుప్పాల రఘు, నాంపల్లి శ్రీనివాస్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు సోమిడి వేణు, కటకం లోకేష్, సొల్లు అజయ్ వర్మ, బండ రమణారెడ్డి, బల్బీర్సింగ్, దాసరి రమణారెడ్డి, మామిడి చైతన్య, పుప్పాల రాము, తదితరులు పాల్గొన్నారు. 

పలు సంఘాల మద్దతు...

హిందూ ఏక్తాయాత్రకు వివిధ కులాల, ప్రజా, అధ్యాత్మిక సంఘాల నాయకులు మద్దతు పలికి భాగస్వాములు అవుతామని ప్రకటించారు.  నగర పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దండు అంజయ్య,  ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మేడి మహేష్,  రెడ్డి సంఘం అధ్యక్షులు జగ్గారెడ్డి, కాపు సంఘం అధ్యక్షులు బొమ్మరాతి రామచంద్రం, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మెతుకు సత్యం, పోపా అధ్యక్షులు పోలు సత్యనారాయణ, వెలమ సంఘం అధ్యక్షులు జువ్వాడి వేణుగోపాలరావు, యాదవ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ, ప్రసాద్, కురుమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఐలయ్య రాజు, వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కన్న కృష్ణ, వైశ్య సేవా కేంద్రం జిల్లా అధ్యక్షులు చిదుర సురేష్, ఆర్యవైశ్య సంఘం యువజన సంఘం జిల్లా అధ్యక్షులు జడిగే సాయి కృష్ణ, వాసవి సేవా కేంద్రం డైరెక్టర్& ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కైలాస నవీన్, జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తొడుపునూరి కరుణాకర్, మేదరి సంఘం పట్టణ అధ్యక్షులు రమేష్, మార్వాడి సమాజ్ ప్రతినిధి కమల్ ముందడ,  సింధు సమాజ్ బాధ్యులు మోహన్ లాల్, గురుద్వారా కమిటీ అధ్యక్షులు సర్దుల్ సింగ్, నాయి బ్రాహ్మణ జిల్లా & పట్టణ అధ్యక్షులు నీలం మొండయ్య, కంది వెంకటేశ్వర్లు, నేతకాని సంఘం బాధ్యులు జాడి బాల్రెడ్డి, గాండ్ల సంఘం బాధ్యులు జక్కని సంపత్, మేర సంగం ప్రతినిధి పవన్, రజక సంఘం ప్రతినిధులు బాలయ్య & కనకయ్య, బట్రాజు సంఘం జిల్లా అధ్యక్షులు మధుసూదన్‌రాజు పాల్గొని హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేస్తామని పేర్కొన్నారు.