calender_icon.png 6 May, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి

25-04-2025 02:04:35 AM

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

మునుగోడు,ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): పెండింగ్లో ఉన్న భూ సమస్యలను భూ యజమాని హక్కులను కాపాడందుకే నూతన భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు చండూర్ మండల కేంద్రాల్లో  నిర్వహించిన భూభారతి చట్టం 2025 చట్టం పైన అవగాహన సదస్సు కార్యక్రమానికి కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి హాజరయ్యారై మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిందన్నారు. ధరణి పోర్టల్ లో పరిష్కారం కాని సమస్యలను కూడా భూభారత చట్టం పరిష్కరిస్తుందని రైతులు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి తాసిల్దార్లు నరేందర్, దశరథ, రెవెన్యూ అధికారులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల అధికారులు ఉన్నారు.