calender_icon.png 28 May, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెలవుల్లోనైనా ప్రతి మంగళవారం ఫిజియోథెరపీ..

06-05-2025 06:28:10 PM

వైరా (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వైరా మండల వనరుల కేంద్రంలో వేసవి సెలవులైనప్పటికీ ప్రతి మంగళవారం ఫిజియోథెరపీ క్యాంపు కొనసాగుతుందని మండల విద్యాధికారి కొత్తపల్లి వెంకటేశ్వర్లు(Mandal Education Officer Kothapalli Venkateswarlu) తెలిపారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో గత సంవత్సరం మాదిరి గానే ఈ సారి కూడా వేసవి సెలవులలో కూడా ఫిజియోథెరపీ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. పాక్షిక పక్షవాతంతో పాటు నడకలో సమస్యలు గల ప్రత్యేక అవసరాలు గల బాల, బాలికలు ఈ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎండాకాలంలో సైతం క్యాంప్ నిర్వహిస్తున్నందుకు పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ వి.వసంత, ప్రత్యేక ఉపాధ్యాయులు తాళ్లూరి రవి, వి.అజిత తదితరులు పాల్గొన్నారు.