calender_icon.png 7 May, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా

06-05-2025 06:32:53 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...

చెన్నూర్: వేసవిలో ప్రజలకు ఎలాంటి త్రాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతరాయంగా నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. మంగళవారం చెన్నూర్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అమృత్ 2.0 నీటి ట్యాంక్ నిర్మాణ పనులను మున్సిపల్ కమీషనర్ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... వేసవిలో ప్రజలకు నిరంతరాయంగా త్రాగునీటిని సరఫరా చేస్తామన్నారు. మిషన్ భగీరథ పథకంలో నల్లా కనెక్షన్ల ద్వారా ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేయడం జరుగుతుందని, ప్రజలకు మరింత చేరువలో త్రాగునీటిని అందించేందుకు అమృత్ 2.0 పథకంలో నీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ట్యాంక్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. 

కొనుగోళ్లను పరిశీలించిన కలెక్టర్

మండలంలోని అంగరాజుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడంతో పాటు గోనె సంచులు, టార్పాలిన్లను అవసరం మేరకు సమకూర్చాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసినప్పుడు రైతులకు రశీదు జారీ చేయాలని, రైతు వివరాలు, ధాన్యం వివరాలను ట్యాబ్లలో నమోదు చేయాలని తెలిపారు. పొక్కూర్ గ్రామపంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రహారీగోడ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని, అర్హులైన లబ్దిదారుల జాబితాను రూపొందించాలని, జాబితాలో అర్హులు మాత్రమే ఉండాలని అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యల వివరాలు తెలుసుకొని, పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సుందరశాల గ్రామపంచాయతీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్మిస్తున్న ప్రహారీగోడ నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం.మోహన్, మండల పంచాయతీ అధికారి ఎండి. అజ్మత్అలీ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.