06-05-2025 06:21:31 PM
మునగాల: అమెరికా దేశంలోని చికాగో నగరంలోని కార్మికులు అందించిన ఎర్రజెండా చేతబూని వారి స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ గ్రామ శాఖ కార్యదర్శి డి రవి అన్నారు. మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో మేడే వారోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి మేడే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ గ్రామ శాఖ కార్యదర్శి ధరవత్ రవి జెండా ఆవిష్కరణ చేశారు.
అనంతరం సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పోటు లక్ష్మయ్య, గ్రామ శాఖ కార్యదర్శి ధరవత్ రవి మాట్లాడుతూ... అమెరికా దేశంలోని చికాగో నగరంలో పనిగంటల తగ్గింపు కోసం కార్మికులు ఉద్యమాలను నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు ముక్కలు కాల్పులు జరపటంతో అమరులైన కార్మికులు తమనెత్తిరిమడుగుల్లో నుంచి ఎర్రజెండాను తీసి కార్మికులకు అండగా ఎర్రజెండా ఉంటుందని అన్నారు. ఆనాటి నుండి నీటి వరకు చికాగో అందులో అందించిన స్ఫూర్తితో మేడే వారోత్సవాలు గ్రామ గ్రామాన వాడ వాడన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
బిజెపి ప్రభుత్వం మావోయిస్టుల పేరుతో అడువుల్లోని సంపదను దోచుకు వెళ్లడం కోసం ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక పేదలను ఆదివాసీలను మావోయిస్టులు చిత్రం హతమారుస్తూ అనేక కుట్రలు పండుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వ్యాపార స్వలాభం కోసం కక్కుర్తి రాజకీయాలు చేస్తూ మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ కాలం వెల్లదీస్తుందని వారు అన్నారు. బిజెపికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు వారి విధానాలను తిపికొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మేడే వారోత్సవాల్లో చాలా భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు యల్లవుల సైదులు, గ్రామ సెల్ కార్యదర్శిలు సైదా, వీరబోయిన బాలయ్య, నాయకులు యల్లవుల శివ, వట్టేపు కోటయ్య, పొన్నం బ్రహ్మం, కోటయ్య, కీట్టయ్య, వీరయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.