25-04-2025 02:06:13 AM
బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): కృష్ణా జలాలను సాధించడంలో, బనకచర్ల సమస్యను పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని బీఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మె ల్యే హరీశ్‌రావు విమర్శించారు. హ్యాష్‌ట్యాగ్ సీఎంవో, హ్యాష్‌ట్యాగ్ భట్టిమల్లు పేరుతో ఎక్స్ వేదికగా గురువారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.
రూ.8,929 కోట్ల రుణ కేటాయింపులపై ఎందుకు నిష్క్రియాత్మకంగా ఉన్నారన్నా రు. రెండు లక్షల ఉద్యోగాల కల్పనలో ప్రజాప్రభుత్వం విఫలమైందని ఫైరయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ విజన్ ఎక్కడుందని హరీశ్‌రావు ప్రశ్నించారు.