calender_icon.png 10 October, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్డర్ చెక్‌పోస్ట్ ఏర్పాటు

09-10-2025 12:00:00 AM

అలంపూర్, అక్టోబర్ 8: గద్వాల జిల్లాలో తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బుధవారం పోలీసులు బార్డర్ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్త్స్ర కిరణ్ కుమార్ తెలిపారు.

అందులో భాగంగాఏపీ నుంచి తెలంగాణలోకి వస్తున్న వాహనాలను నిలిపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.చెక్ పోస్ట్ వద్ద మూడు షిఫ్టుల్లో 24 గంటలు పోలీసులు విధులు నిర్వహించునున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.ప్రతి షిఫ్ట్ కు ఒక ఎస్‌ఐ తో పాటు నలుగురు పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు .రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నగదు, మద్యం ఇతర వస్తువుల తరలింపు పై ప్రత్యేక నిఘాను ఉంచనున్నట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు.