calender_icon.png 7 September, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారంలో పెద్ద పులి కలకలం

07-09-2025 12:29:22 AM

  1. అడవిలో పశువుల కాపరులకు కనిపించిన వైనం
  2. పులి అడుగులు ఉన్నట్లు అటవీ శాఖ గుర్తింపు
  3. భయం నీడలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు
  4. ప్రజలను అప్రమత్తం చేసిన ఎఫ్‌ఆర్‌ఓ  

ములుగు, తాడ్వాయి, సెప్టెంబర్ 6 (విజయ క్రాంతి): ఏజెన్సీప్రాంతమైన తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. తమకు పులి అడుగులు కనిపించినట్లు పశువుల కాపరులు తెలిపారు. ఊరట్టం సమీపంలోని కొండ్రేటివాగు నీళ్ల పారకం ఉంటుంది. ఎల్లకాలం ప్రవహిస్తుంది. మేడారం, కన్నెపెల్లి ఏరియా అడవి ప్రాంతం నుంచి వాగులు పత్తి,వరి పంటల్లో తిరిగినట్లు అడుగులు ఉన్నాయని తెలిపారు.

కాగా వర్షాకాలంలో పెద్దపులి సంచారం ఏమిటి? అనేది పలు గ్రామాల గిరిజనులో  భయపడుతున్నారు. మరోకవైపున సందేహలు వ్యక్తం చేస్తున్నా రు. ములుగు జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నట్లు, రెండురోజులుగా తెలుస్తుంది. మేడా రం అడవుల్లోకు వచ్చినట్లు ఆహరం కోసం సంచరిస్తున్నట్లు కొందరు అంటున్నారు. మేడారం, తాడ్వాయి, కొండాయి, దొడ్ల గ్రా మాల్లో గిరిజనులకు పశువులు ఉంటా యి.

వెంకటాపురం(రామప్ప)శివారు అడవుల్లో నుంచి కాల్వపెల్లి, కన్నెపెల్లి, మేడారం అడవుల్లోకి ప్రవేశించినట్లు ఆ ఏరియా పశువుల కాపర్ల ద్వార గ్రామస్తులకు తెల్సినట్లు చెప్పా రు. ఈ సమాచారం అంతటా దానంలా వ్యాపించింది. పైన తెలిపిన అటవీశాఖ అదికారులు అప్రమత్తం అయునట్లు తెల్సింది. రామప్ప,వెంకటాపురం ఏరియాలో ఫారెస్టు అదికారులు పెద్దపులి అడుగులను గుర్తించినట్లు తెలపడంతో మేడారం, కన్నెపెల్లి ఊర ట్టం ఏరియాలో పనుచేస్తున్న అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యరు.