07-09-2025 12:30:02 AM
తమిళనాడు గవర్నర్ డాక్టర్ శ్యాంసుందర్ గౌడ్ కు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానం
ముషీరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): అక్టోబర్ 3న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ శనివారం తమిళనాడు గవర్నర్ డాక్టర్ బి. శ్యాంసుందర్ గౌడ్ ఆయన సతీమణి లక్ష్మి లను హైదరాబాద్ రాజ్ భవన్ లో కలిసి శాలువాలు కప్పి సాదరంగా ఆహ్వానించినట్లు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. సానుకూలంగా స్పందించిన తమిళనాడు గవర్నర్ శ్యాంసుందర్ గౌడ్ అలై బలై కార్యక్రమానికి హాజరవుతానని తెలిపినట్లు బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, ఆర్. ప్రదీప్ కుమార్, బిజెపి అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.