calender_icon.png 22 November, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదారం బీట్‌లోకి పెద్దపులి?

10-02-2025 12:00:00 AM

బెల్లంపల్లి, ఫిబ్రవరి 9: గత 11 రోజులుగా కన్నాల-బుగ్గ అటవీప్రాంతంలో అటవీ అధికారులకు, ప్రజలకు ముచ్చెమటలు పట్టించిన పెద్దపులి ఆదివారం కన్నాల అడవుల మీదుగా మాదారం బీట్‌లోకి వెళ్లిపోయినట్లు పాదముద్రల ఆధారంగా తెలుస్తున్నది. కన్నాల అటవీప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పెద్దనపల్లి, సోమగూడెం దుబ్బగూడెం, బుగ్గ దేవాలయం పరిసర ప్రాంతాలైన బుగ్గగూడెం, కొత్తవరిపేట అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ హడలెత్తించింది.

పెద్దపులి భయంతో బెల్లంపల్లి నుంచి బుగ్గ దేవాలయానికి వె  రహదారిని మూసేశారు. బుగ్గగూడెం, బో  రోడ్లలో కూడా వాహనాల రాకపోకలపై నిషేధాజ్ఞలు విధించారు. తాజాగా ఆదివారం పెద్దపులి బుగ్గదేవాలయం సమీపంలోని కొండపోచమ్మ గుడి పక్క నుంచి అం  గుట్టల మీదుగా తాండూర్ మండలంలోని మాదారం బీట్‌లోకి వెళ్లిపోయినట్లు పాదముద్రల ఆధారంగా నిర్ధారించినట్లు ముత్యంపల్లి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్‌నాయక్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పెద్దపులి కన్నాల అడవులను వీడి మాదారం అడవుల్లో సంచరిస్తున్నట్లు తెలుస్తున్నది.