calender_icon.png 22 November, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులతో కిక్కిరిసిన మల్లన్న క్షేత్రం

10-02-2025 12:00:00 AM

చేర్యాల, ఫిబ్రవరి 9:  ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో ఆదివా రం ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉత్సవాలు ప్రారంభమై నెలరోజులు కావస్తున్న భక్తుల రద్దీ మాత్రం పెరుగుతూనే ఉంది. భక్తులు శనివారం రాత్రి ఆలయానికి చేరుకుని బస చేశారు.

ఆదివారం వేకువజామునే లేచి, స్వామి వారి పుష్కరిణి  లో స్నానమాచరించారు. ఆలయ ద్వారం తెరవ క ముందే, ఉదయం నాలుగు గంటల నుం డి క్యూలైన్లో స్వామివారి దర్శనార్థం భక్తులు నిలుచున్నారు. ఆలయ ద్వారం తెరవగానే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దర్శన అనంతరం మొక్కుల్లో భాగంగా గంగిరేణి చెట్టు వద్ద స్వామివారికి బోనం నైవేద్యంగా సమర్పించి, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా గుట్టపై నెలకొని ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం నైవేద్యంగా సమర్పించారు.

మరికొంతమంది భక్తులు అమ్మ వారికి ఓడిబియ్యం పోసి ’మమ్ము కరుణిం చు తల్లి’ అని భక్తులు వేడుకున్నారు. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటల సమ యం పట్టింది. గంటలకు కొద్ది క్యూలైన్లో నిరీక్షించడంతో పిల్లలు వృద్దులు ఇబ్బందులు పడ్డారు. 

అలాగే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారిని దర్శనం చేసు కున్నారు. రద్దికి తగ్గట్టుగా ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేశారు. స్వామివారి  రాగి డాలర్లను(5 గ్రా,   2.5 గ్రా) విక్రయించనున్నట్లు ఆలయ కార్య నిర్వాహక అధికారి కే రామాంజనేయులు తెలిపారు. సిఐ ఎల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.