calender_icon.png 4 October, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏక్షణంలోనైనా బీహార్ ఎలక్షన్ షెడ్యూల్

04-10-2025 02:08:00 AM

పాట్నా, అక్టోబర్ 3: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళో రేపో షెడ్యూల్ విడుదల కానున్నది. ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, ఎస్‌ఎస్ సంధు శనివారం రెండు రోజుల పాటు అక్కడే ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికలకు అక్కడి పరిస్థితులన్నీ అనుకూలమని వారు భావిస్తే, వెనువెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నది. ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల పర్యటన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొన్నది.