04-10-2025 02:06:06 AM
చెన్నై, అక్టోబర్ 3: తమిళనాడు రాజధాని చెన్నైలో శుక్రవారం ఉదయం వరుస బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్‌ఎన్ రవి, నటి త్రిష సహా పలువురు ప్రముఖుల ఇళ్లే లక్ష్యంగా ఆగంతుకులు ఈ--మెయిల్ ద్వారా హెచ్చరికలు పంపించారు. అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.
సీఎం ఎంకే స్టాలిన్ ఆళ్వార్‌పేటలోని నివాసం, నటి త్రిష తేనాంపేటలోని ఇల్లు, టీ నగర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ‘సబరీసన్ వేదమూర్తి’ అనే ఐడీ నుంచి తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి బాంబు బెదిరింపుతో కూడిన ఈ మెయిల్ వచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. గ్రేటర్ చెన్నై నగర పోలీసులు కేసు నమోదు చేసి, ఈమెయిల్స్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు జరుపుతు న్నారు. కాగా తమిళనాడులో కొంతకాలంగా ఇలాంటి బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.